మ‌హిళ‌ల ఆర్థిక స్వాలంబ‌నకు కేశినేని ఫౌండేషన్ అండ‌గా వుంటుంది.

Spread the love

మ‌హిళ‌ల ఆర్థిక స్వాలంబ‌నకు కేశినేని ఫౌండేషన్ అండ‌గా వుంటుంది.

ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు స్వ‌యం స‌మృద్ది వైపు అడుగులు వేయాలి

కేశినేని ఫౌండేష‌న్ ద్వారా పొందిన శిక్ష‌ణ‌తో జీవ‌నోపాధి మెరుగుప‌ర్చుకోవాలి

కేశినేని ఫౌండేష‌న్ చైర్మ‌న్, ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ ఆకాంక్ష‌

ఐన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్ .జి మ‌హిళ‌ల‌ను క‌లిసిన జాన‌కి లక్ష్మీ

విజ‌య‌వాడ : మహిళల ఆర్థిక స్వతంత్రతే కుటుంబం, సమాజం ,రాష్ట్ర అభివృద్ధికి పునాది. ఎస్‌.హెచ్‌.జి మహిళలు స్వయం సమృద్ధి వైపు ధైర్యంగా అడుగులు వేయాలి. ఎంపీ కేశినేని శివ‌నాథ్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో ఎన్.ఐ.ఆర్.డి స‌హ‌కారంతో అందిస్తున్న నైపుణ్యాభివృద్ది శిక్షణను వినియోగించుకుని జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని కేశినేని ఫౌండేష‌న్ చైర్మ‌న్, ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ ఆకాంక్షించారు.

హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ఐదు రోజుల నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో శిక్ష‌ణ తీసుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి కి చెందిన 61 మంది మ‌హిళ‌ల‌ను కేశినేని జానకి ల‌క్ష్మీ బుధ‌వారం క‌లిశారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యం బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో గ‌త మూడు రోజులుగా ఎస్.హెచ్.జి మ‌హిళులు పొందుతున్న శిక్ష‌ణ వివ‌రాల‌ను జానకీ ల‌క్ష్మీ వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే హోమ్ బెస్డ్ ప్రొడ‌క్ట్స్ , హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రోడ‌క్ట్స్ త‌యారీ పై తాము పొందుతున్న శిక్ష‌ణ లో భాగంగా త‌యారు చేసిన పోటో ప్రేమ్స్, ఎల్.పోల్డ‌ర్స్, ఫైల్స్, ఫినాయ‌ల్స్, ఫ్లోర్ క్లీనర్ , టాయిలెట్ క్లీనర్ చూపించారు.

అలాగే ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు కేశినేని జాన‌కి లక్ష్మీతో మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివ‌నాథ్ చొర‌వ‌, కేశినేని ఫౌండేష‌న్ స‌హ‌కారంతోనే ఈ నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. త‌మ జీవ‌నోపాధి మెరుగుప‌ర్చుకునేందుకు శిక్ష‌ణ ఇప్పించినందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు వారంతా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అనంత‌రం జాన‌కి ల‌క్ష్మీ మాట్లాడుతూ మ‌హిళ‌లు త‌ల్చుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌ర‌ని, ముఖ్యంగా పొదుపు చేయ‌టం తెలిసిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు మ‌రింత శ‌క్తివంతుల‌న్నారు. పొదుపు చేయ‌టంలో విజ‌యం సాధించిన మ‌హిళ‌లు, స్వ‌యం ఉపాధి రంగంలో విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. ఎస్.హెచ్.జి అంటే కేవ‌లం సేవింగ్స్ మాత్ర‌మే కాదు…స్వ‌యం స‌మృద్ది వైపు అడుగులు వేయ‌టమ‌న్నారు. కేశినేని ఫౌండేషన్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ నిలబెట్టే సంస్థగా కొనసాగటంతోపాటు, ఎల్లప్పుడూ అండగా, తోడుగా ఉంటుంద‌న్నారు.

ఎన్.ఐ.ఆర్.డి శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌ల‌కు మండ‌లాలకు వ‌చ్చి క‌లుస్తాన‌ని…ఇక్క‌డ శిక్ష‌ణ ద్వారా నేర్చుకున్న అంశాల‌ను గ్రామాల్లోని ఇత‌ర మ‌హిళ‌ల‌కు నేర్పించి అంద‌రూ క‌లిసి ఒక ప్రొడ‌క్ట్ యూనిట్ నెల‌కొల్పాల‌న్నారు. యూనిట్ లో త‌యారు చేసే వ‌స్తువుల‌కు మార్కెటింగ్ స‌హ‌కారం అందిస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఆశ‌యమైన కుటుంబానికి ఒక పారిశ్రామిక వుండాల‌న్న నినాదం స్పూర్తితో ఎంపీ కేశినేని శివ‌నాథ్, కేశినేని ఫౌండేష‌న్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. అందుకే త‌న సొంత నిధుల‌తో ఎంపీ కేశినేని శివ‌నాథ్ గ్రామాల ప‌రిపూర్ణ వికాసం కోసం, మ‌హిళ‌ల సాధికార‌త‌, స్వాలంబ‌న సాధించే విధంగా ప్ర‌ణాళిక సిద్దం చేసి ..ఆ దిశ‌గా ఎన్.ఐ.ఆర్.డి, ఎన్టీఆర్ జిల్లా అధికారుల స‌హ‌కారంతో కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మాద్ ఖాన్, ప్రోఫెసర్స్ డాక్టర్ కతిరేషన్, ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ ఎన్.ఐ.ఆర్.డి కో- ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ మ‌హిళ స‌మైక్య అధ్యక్షురాలు కందుల క‌ల్ప‌న‌, జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌ల మ‌హిళ స‌మైక్య అధ్య‌క్షురాలు ర‌జ‌నీ ల‌తో త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading