మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేయండి. రాష్ట్రంలో ఈ అరాచకాలు పెరుగుతున్నాయి..

Spread the love

 మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేయండి. రాష్ట్రంలో ఈ అరాచకాలు పెరుగుతున్నాయి.. 

* తీవ్రంగా స్పందించిన రామచంద్ర యాదవ్ * పుంగనూరు బాలిక కుటుంబానికి అండగా బీసీవై పార్టీ!

రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.. పుంగనూరులో ఆరేళ్ళ చిన్నారి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన తనను కలచివేసిందని.. దీనిపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. “పార్టీ తరపున నాయకులు, ప్రతినిధులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం సహా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు రామచంద్ర యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తక్షణమే రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, నగర పాలక సంస్థల్లోని కూడళ్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేసారు..

* టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉమ్మడి కర్నూలు జిల్లా మచ్చుమర్రిలో ఇదే తరహా ఘటన జరిగింది.. ఎనిమిదేళ్ల చిన్నారిపై దారుణ కాండ జరిపి, ఆమె మృతదేహం కూడా కనిపించకుండా చేశారు.. ప్రభత్వం ఆ ఘటనలో వాస్తవాలు ఇప్పటికీ తేల్చలేదు.. 

* ఈ నాలుగు నెలల్లో చీరాల, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, ఏలూరు సహా అనేక ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై నేరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు.. 

* పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయండి.. మహిళల నేరాలపై దర్యాప్తునకు ప్రత్యేక సిబ్బందిని నియమించండి.. అలాగే పట్టాన ప్రాంతాల్లోనూ.. నిర్మాణుయుష్య ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల నిఘా, పోలీసు నిఘా, పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తే నేరాలు కొంత మేరకు తగ్గుముఖం పెట్టె అవకాశం ఉంటుంది.. 

* నేరాలపై సీఎం స్థాయిలో వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించి.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని నేరాలను అరికట్టాలని రామచంద్ర యాదవ్ కోరారు.. పుంగనూరు బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని.. బాధ్యులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *