మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు.

Spread the love

 మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి 

సుజనా చౌదరి 

మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. రోటరీ విజయవాడ మిడ్ టౌన్, మరియు రోటరీ విజయవాడ శ్రీ దుర్గ సంయుక్త ,ఆధ్వర్యంలో భవానిపురంఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా ముఖ్య అతిథిగా హాజరై వందమంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న సంకల్పంతో కోల్ ఇండియా లిమిటెడ్ వారు , సిఎస్ఆర్, ప్రాజెక్టులో భాగంగా కుట్టు మిషన్లను అందించడం శుభ పరిణామం అన్నారు. కోలిండియా ప్రాజెక్టు వారు , రోటరీ మిడ్ టౌన్,రోటరీ శ్రీదుర్గ వారు, తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తన చేతుల మీదుగా రెండవసారి కుట్టు మిషన్లను పంపిణీ చేయడం సంతోషం అన్నారు. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం లోని మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి , మరిన్ని కుట్టు మిషన్లను పంపిణీ చేసి మహిళా అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రావూరి వెంకటసుబ్బారావు, చైర్మన్ గొడుగు కృష్ణారెడ్డి, గుడిపాటి కిషోర్, కె.వి శ్రీనివాసరావు, స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ శివ శంకర్ రావు, కూటమి నాయకులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెస్ బేగ్, యేదుపాటి రామయ్య, తిరుపతి అనూష, అబ్దుల్ ఖాదర్, రోటరీ క్లబ్ మహిళలు హాజరయ్యారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *