మహిళలందరికీ, ముఖ్యంగా తెలుగు మహిళా కమిటీలో ఉన్న అందరికీ దసరా కానుకలను అందజేసిన -MLA బొండా ఉమ

Spread the love

30-9-2025

మహిళలందరికీ, ముఖ్యంగా తెలుగు మహిళా కమిటీలో ఉన్న అందరికీ దసరా కానుకలను అందజేసిన -MLA బొండా ఉమ

ధి:-30-9-2025 మంగళవారం ఉదయం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలోని మహిళలకు కుటుంబ సభ్యులుగా చీరలు పంపిణీ చేయడం జరిగిందిఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వాడవాడలా ఈ పండుగ వాతావరణం నెలకొంది, జగన్మాత దుర్గమ్మ తల్లికి భక్తులు అత్యంత నిష్టతో, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి, ప్రతిరోజు ఇంద్రకీలాద్రిపై లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు అని…ఈ భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ అధికారులు మరియు తెలుగుదేశం ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేశాం అని…. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని అమ్మవారి దర్శనం అందరికీ సులభంగా అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది అని, భక్తుల రద్దీని నియంత్రించడానికి, క్యూలైన్లను క్రమబద్ధీకరించడానికి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించాం అని…విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక చోట్ల దుర్గమ్మ తల్లి పందిర్లను ఏర్పాటు చేసి, నవరాత్రులను అత్యంత నిష్టతో నిర్వహిస్తున్న మా సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి పైడి తులసి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి..ఈ కార్యక్రమం పట్ల మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు,మా చెల్లెల్లు ఎప్పుడూ కూడా మేము కాపాడుకుంటాం, మా చెల్లెలు అండగా ఉంటాం అనే భావనను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు, పండగ అనేది కేవలం మా ఇంట్లోనో, కొద్దిమందితోనో చేసుకునేది కాదని, కుటుంబ పరంగా అందరూ కలిపి సంతోషంగా చేసుకునేదే పండగ అని తెలుగుదేశం ప్రభుత్వం లో మహిళలు అందరికి ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు, ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, Ex. కార్పొరేటర్ సెంట్రల్ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి పైడి తులసి లతో పాటు వందలాదిమంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *