మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
రథం సెంటర్లోని అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంస్థను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) గురువారం సందర్శించారు. ట్రస్ట్ సభ్యులు ఆహ్వానం మేరకు దసరా ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా భావించి శతాబ్ది కాలంగా అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్టు వారు చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజ సేవలో భాగస్వాములైన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా సుజనా భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు అప్పన సాయిబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు ఆలమూరు అమర్నాథ్, తొండెపు హనుమంతరావు, మూల్పూరి ఉపేంద్ర, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.