మహర్నవమి సందర్భంగా సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధాలకు పూజ నిర్వహించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ.01.10.2025.

మహర్నవమి సందర్భంగా సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధాలకు పూజ నిర్వహించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాంప్రదాయ పద్ధతులను పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం దసరా శరన్నవరాత్రులలో మహర్నవమి రోజున విజయవాడ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మరియు అన్ని విభాగాలలో ఆయుధాలకు పూజలు నిర్వహించడం జరుగుతుంది.

ఈ క్రమంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహర్నవమి సందర్భంగా ది.01.10.2025 వ తేదీన విజయవాడ సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ కార్యాలయం నందు ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషన్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ దంపతుల ఆధ్వర్యంలో ఆయుధాలకు మరియు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. ఏ. బి. టి. ఎస్. ఉదయరాణి ఐ. పి. ఎస్. ఎస్.వి.డి.ప్రసాద్ ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కె.కోటేశ్వర రావు ఏ.ఆర్ ఏ.సి.పి. లు డి. ప్రసాద్ కృష్ణంరాజు ఆర్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *