మల్లాది విష్ణుకి రాఖీ కట్టిన బ్రహ్మ కుమారీలు

Spread the love

 *19.08.2024*

మల్లాది విష్ణుకి రాఖీ కట్టిన బ్రహ్మ కుమారీలు

ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీలు వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి రాఖీ కట్టారు. రాబోయే రోజుల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా అభిలషించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోదరీమణులు లేని తనకు నియోజకవర్గ ఆడపడుచులు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. రాఖీ పౌర్ణమి సోదరభావానికి నిలువెత్తు నిదర్శనం అని.. భార‌తీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమ‌ని పేర్కొన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ములకు అనురాగంతో చేతికి రాఖీ కట్టడం అనాదిగా వస్తోందన్నారు. ఆ దుర్గమ్మ చల్లని దీవెనలు అక్కచెల్లెమ్మలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *