
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. *తేదీ. 11-11-2025.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 165 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు
విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి అదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది.
ఈ నేపధ్యంలో ది.11-11-2025 వ తేదిన 2వ, 4వ, 5వ, మరియు 6వ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం 165 కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను సంబంధిత కోర్ట్ లలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆర్.వి.ఎస్. శర్మ లెనిన్ బాబు మొత్తం 165 మందిలో 30 మందికి ఒకొక్కరికి రూ.15,000/- చొప్పున 4,50,000/- మిగిలిన 135 మందికి ఒక్కొక్కరికిరూ.10,000/- చొప్పున రూ.13,50,000/- మొత్తం 165 మందికి రూ.18,00,000/- జరిమానా విధించడం జరిగింది.
ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. తెలియజేయటం జరిగింది.
![]()
