Home Andhra Pradesh మట్టిలో మెరిసిన మాణిక్యాలు.

మట్టిలో మెరిసిన మాణిక్యాలు.

2
0

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.

  • ది.05.08.2025.

మట్టిలో మెరిసిన మాణిక్యాలు.

హోంగార్డును అతని పిల్లలను అభినంధించిన నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

తొలిప్రయత్నంలోనే సివిల్ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన హోంగార్డు చిట్టిబాబు ఇద్దరి కుమార్తెలు రత్న శ్రీ , జయశ్రీ .

సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన మరో ఇద్ధరు హోంగార్డుల కుమారులు

వంగూరి చిట్టిబాబు విజయవాడలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ తన ఇద్దరు కూతుళ్లకు మొదటి ప్రయత్నంలో సివిల్ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన నేపధ్యంలో ఈ రోజు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో కలిసి వివరాలు తెలుసుకుని రత్నశ్రీ ,జయశ్రీ లను అభినంధించారు. ముగ్గురు ఆడపిల్లలు అయిన హోంగార్డు గా విధులు నిర్వహిస్తూ ఎక్కడా దైర్యం కోల్పోకుండా వారిని తీర్చిదిద్దిన హోంగార్డు చిట్టిబాబును ప్రత్యేకంగా అభినంధించారు. అనంతరం అడ్మిన్ డి.సి.పి.  కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. ఇతర పోలీసు అధికారులు అభినంధించారు.

ఎన్.టి.ఆర్.జిల్లా జి కొండూరు మండలం బీమావరప్పాడు గ్రామానికి చెందిన వంగూరి చిట్టిబాబు 10 వ తరగతి వరకు చదువుకుని 1991 వ సంవత్సరంలో విజయవాడ పోలీసు విభాగంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్నారు. 1992 వ సంవత్సరంలో చిట్టిబాబు వెలగలేరు ప్రాంతానికి చెందిన మణిని వివాహం చేసుకున్నారు. వీరు 10 వ తరగతి వరకే చదువుకున్నారు.  వీరికి  తేజ భసవ శ్రీ, రత్న శ్రీ, జయశ్రీ అనే ముగ్గురు ఆడపిల్లలు సంతానం.  ముగ్గురు ఆడపిల్లలు అయిన ఎక్కడా బాధపడకుండా అతి కష్టం మీద జి కొండూరు నుండి సైకిల్ మీద విజయవాడ వచ్చి విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళి పొలం పనులు చేసుకుంటూ గేదెలను కాస్తూ ముగ్గురు పిల్లలను మైలవరం లోని ప్రైవేట్ స్కూల్ లో ఇంటర్ వరకు చదివించినాడు. చుట్టుపక్కల పెద్ద వాళ్ళు పిల్లలకు టెన్త్ అవ్వగానే పెళ్ళి చెయ్యమని చెప్పినా వారి మాటలను సైతం లెక్క చేయకుండా ముగ్గురు బాలికలను బి.టెక్ మరియు డిగ్రీ చదివించినారు. అన్నింటినీ వదులుకుని తన పిల్లలే తన ఆస్తిగా అనుకుని చదివించినారు.  ఈ క్రమంలోనే పెద్ద పాప సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూన్న సమయంలో  పెళ్ళి చేసి పంపినారు. 

తన తండ్రి కష్టాన్ని చూసిన రత్నశ్రీ మరియు జయశ్రీ లు కష్టపడి చదువుకున్నారు.  రత్నశ్రీ ఇంటర్ అనంతరం 2019 లో మైలవరం లోని లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాలలో బి.టెక్ 80 శాతం మార్కులతో పూర్తి చేసింది. జయశ్రీ విజయవాడ లోని ఆంద్రా లయోలా కళాశాలలో డిగ్రీ ( బి.ఏ.ఏకనామిక్స్) 85 శాతం మార్కుల తో పూర్తి చేసింది. వీరు ఫోన్ వినియోగించరు,  టి.వి. కూడా చూడరు. ఖాళీ సమయాలలో పుస్తకాలను మరియు న్యూస్ పేపర్స్లను చదువుకునేవారు.  వీరి చదువు పూర్తి అయిన తరువాత తండ్రి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వ ఉధ్యోగమే లక్ష్యంగా చేసుకుని విజయవాడ లోని కొద్ది రోజుల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నారు. అనంతరం ఇంటివద్దే ఉంటూ గేదెల పెంపకంలో మరియు ఇంటి పనులలో తల్లిదండ్రులకు సహకరిస్తూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యారు. వీరిలో జయశ్రీ మొన్న జరిగిన గూప్ 2  మెయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి మెరిట్ లిస్ట్ కోసం వేచి ఉంది.  ఈ క్రమంలోనే వీరు మొదటి ప్రయత్నంలోనే రత్న శ్రీ 110 మార్కులతో మరియు జయశ్రీ 127 మార్కులతో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యినారు. 

అదేవిధంగా మరో హోంగార్డు అస్లామ్ బేగ్ యొక్క కుమారుడు మొగల్ అబ్దుల్ అలీం బేగ్ కూడా తొలి ప్రయత్నం లోనే 126 మార్కులతో మరియు మరో హోంగార్డు రాఘవులు కుమారుడు పూర్ణ నాగార్జున 141 మార్కులతో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యినారు.  వీరిని కూడా నగర పోలీసు కమిషనర్  అభినంధిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here