మచిలీపట్నం పోర్ట్ అనుసంధానంగా జాతీయ రహదారులను నిర్మించండి – ఎంపీ బాలశౌరి

Spread the love

తేదీ 07-08-2024

మచిలీపట్నం పోర్ట్ అనుసంధానంగా జాతీయ రహదారులను నిర్మించండి ఎంపీ బాలశౌరి

పెడన- గుడివాడ నాలుగు లైన్లు విస్తరణ, పోర్ట్ నుంచి పెడన బైపాస్ వరకు నాలుగు లైన్లు, పోర్ట్ నుంచి విజయవాడ బైపాస్ వరకు మరో రోడ్డు నిర్మించాలి – ఎంపీ బాలశౌరి

గుడివాడలో జాతీయ రహదారులను కలిపే 3కిమీ రోడ్డు నిర్మాణం చెయ్యాలి ఎంపీ బాలశౌరి

చిన్నఅవుటుపల్లి – ఖాజా జాతీయ రహదారికి వీరపనేనిగూడెం నుంచి 5కిమీ వరకు సర్వీస్ రోడ్లు వెయ్యాలి – ఎంపీ బాలశౌరి

ప్రతిపాదిత మూడు ప్రధాన, ముఖ్యమైన జాతీయ రహదారులు ఏర్పాటుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎంపీ బాలశౌరి, సానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీ

మచిలీపట్నం పోర్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్న తరుణంలో పోర్ట్ నుంచి రాకపోకలకు వీలుండేలా రహదారుల నిర్మించాలని ఎంపీ బాలశౌరి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. ఈ మేరకు మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణంపై మూడు లేఖలను మంత్రికి అందజేశారు. ఇప్పటికే పోర్టు పనులు దాదాపు 25 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో పోర్టు అనుసంధానంగా రెండు జాతీయ రహదారులు, పెడన – గుడివాడ మధ్య జాతీయ రహదారిని నాలుగు లైన్లను విస్తరించాలని ఎంపీ బాలశౌరి కోరారు. ప్రధానంగా పెడన నుంచి గుడివాడ వెళ్లే 216 జాతీయ రహదారి ప్రస్తుతం రెండు వరుసల రోడ్డు ఉండగా.. ప్రస్తుతం, రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పెడన – గుడివాడ రోడ్డును నాలుగు వరుసలకు పెంచాలని ఎంపీ తెలిపారు. అదేవిధంగా పోర్టుకు అనుసంధానంగా పెడన బైపాస్‌కు కలిపేలా సుమారు 4 కి.మీ వరకు నాలుగు వరసల రోడ్డును నిర్మించాలని ఎంపీ బాలశౌరి వినతిపత్రం ఇచ్చారు. ఇక పోర్టు నుంచి చిలకలపూడి వరకు జాతీయ రహదారిని పోర్టు నిర్మిస్తున్న గుత్తేదారు సంస్థ నిర్మిస్తామని ముందుకు రాగా.. చిలకలపూడి నుంచి విజయవాడ బైపాస్‌ ఎన్‌హెచ్‌ -65 కలిపేలా సుమారు 6 కి.మీ నాలుగు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని ఎంపీ కోరారు. ఇప్పటికే దీనికి సంబంధిం భూసేకరణ కూడా పూర్తయిందని ఎంపీ తెలిపారు. ఈ రహదారుల విస్తరణ వల్ల మచిలీపట్నం పోర్టుకు అనుసంధానమై రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ అవస్థలు లేకుండా సాఫీగా సాగిపోతాయని ఎంపీ తెలియజేశారు. ఇక ఎంపీ బాలశౌరి అందజేసిన లేఖపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. త్వరలో నిధులు కేటాయించి ఆయా జాతీయ రహదారులను పూర్తి చేస్తామని చెప్పారు. 

చిన్నఅవుటుపల్లి – ఖాజా జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు వెయ్యాలి

గన్నవరం నియోజకవర్గం పరిధిలో వీరపనేనిగూడెం వద్ద దాదాపు 200 కంపెనిలు, స్టార్టప్ లు ఏర్పాటు కానున్నాయని ప్రస్తుతం నిర్మిస్తున్న చిన్నఅవుటుపల్లి – ఖాజా జాతీయ రహదారి మార్గం వీరపనేని గూడెం పక్కనే ఉన్న మర్లపాలెం, తెంపల్లి, బిబి గూడెం గ్రామాలు ఉన్నాయి కాబట్టి సుమారు 5కిమీ వరకు సర్వీస్ రోడ్లను నిర్మించాలని ఎంపీ కోరారు. అదేవిధంగా మర్లపాలెం వద్ద రైల్వే పట్టాలు వున్నందున అక్కడ రాంప్ ఒకటి ఏర్పాటు చేయాలని అన్నారు. 

గుడివాడలో జాతీయ రహదారులను కలిపే 3కిమీ రోడ్డు నిర్మాణం చెయ్యాలి

గుడివాడ పట్టణం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. అవి NH165, NH216 కాగా ఈ రెండు జాతీయ రహదారుల మధ్య వ్యత్యాసం 3కిమీ మాత్రమే ఉందని వీటికి అనుసంధానంగా జాతీయ రహదారి(3KM) నిర్మించాలని అన్నారు. అదేవిధంగా త్వరలో NH216 రహదారిని రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లకు పెంచే ప్రతిపాదనలు వున్న నేపథ్యంలో గుడివాడ పట్టణం దుకాణాలు తొలగించాల్సి వస్తుంది కాబట్టి అందుకోసం మరిన్ని నిధులు కేటాయించాలని మంత్రి నితిన్ గాడ్కరిని ఎంపీ బాలశౌరి కోరారు. 

ఎంపీ కార్యాలయం, మచిలీపట్నం.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *