మంత్రి కొల్లు రవీంద్ర ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

Spread the love

 మంత్రి కొల్లు రవీంద్ర ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 8.8.2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ని మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు  గురువారం సాయంత్రం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర కి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర  కూడా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని ఘనంగా సత్కరించారు. ఆయనతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. మైలవరం నియోజకవర్గ సమస్యల గురించి వివరించారు. స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *