మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మిల మీడియా సమావేశం వివరాలు

Spread the love

 29.07.2024 *(మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం)*

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మిల మీడియా సమావేశం వివరాలు

నేడు గ్రీవెన్స్ కు 12 జిల్లాల నుండి 110 వినతులు వచ్చాయి

గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై అధిక వినతులు వచ్చాయి

వెంటనే అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించాం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి

నేడు గ్రీవెన్స్ కు 12 జిల్లాల నుండి 110 వినతులు వచ్చాయని… గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై అధిక వినతులు అందాయని.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఎక్స్ ఆర్మీ అధికారులు కూడా భూమస్యలపై వినతులు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులుగా చూపి ఫించన్ లు నిలిపేశారంటూ లబ్ధిదారులు వాపోయారని పేర్కొన్నారు. ఆ శాఖ మంత్రిగా పింఛన్ సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి కృషి చేశానన్నారు. ఎంఎస్ఎం ఇండస్ట్రీలో ఇన్ సెన్టీవ్ ఇష్యూలపై వినతులు అందాయన్నారు… వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. లోకల్ ఇండస్ట్రీలకు సంబంధించిన పలు సమస్యలు వచ్చాయని.. వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. కడప జిల్లాలో పనికి రాలేదనే కోపంతో ఒక వ్యక్తిపై వేడి నూనె పోశారు.. అక్కడి పోలీసులు నాడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని వినతి అందిందని.. దానిపై వెంటనే అక్కడి పోలీసులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. టీడీపీ ఆఫీసుకు వెళితే ప్రజల సమస్యలు వింటారు.. సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజలకు కలిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *