మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ప్రారంభం

6
0

తేదీ:16-07-2025
విశాఖపట్నం

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ప్రారంభం

విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖలో కన్నుల పండువగా నిర్వహిస్తున్న ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకలో భాగంగా ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రధానం

పిపిపి విధానంలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ భాగం కావాలని సూచన

సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు

ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా వైజాగ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ మరియు ఏపీ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్లకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విశాఖ నగరం ఎంవిపి కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ లో వైజాగ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ లోగోను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా తన చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేశారు. పిపిపి విధానంలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధిలో భాగంగా సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా అసోసియేషన్లకు సూచించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ4 విధానంలో భాగస్వామ్యులు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సరికొత్త కార్య కార్యరూపంలోకి వస్తుందన్నారు.

వైజాగ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విశాఖ నగరం నుండి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయికి ఎదిగిన నటులు, కళాకారులను అభినందించడం ఆనందించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. సంబంధిత నటులు, కళాకారులు తమ కార్యకలాపాలు ప్రారంభించిన వేదికపై అవార్డులతో సత్కరించడం గర్వించదగ్గ విషయం అన్నారు. గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గడిచిన ఐదేళ్లలో కుంటుపడిన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథం వైపు నడిపిస్తోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఒకపక్క పర్యాటక అభివృద్ధి, మరోపక్క సాంస్కృతిక వికాసం, ఇంకోపక్క సినిమా రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది అన్నారు. గడచిన ఏడాదికాలంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. నాలుగు నెలల క్రితం విశాఖలో టూరిజం కాన్ క్లేవ్ ఏర్పాటు చేసి అనేకమంది ఇన్వెస్టర్లను ఆహ్వానించామని తద్వారా స్థానిక ప్రకృతి సహజ సిద్ధ అందాలను ప్రపంచానికి పరిచయం చేశామన్నారు. ఏడాది కాలంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ. 12,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రకృతి సౌందర్యంతో పాటు ఎక్కువ సంఖ్యలో హోటల్స్, రిసార్ట్స్, గదులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ల ఏర్పాటు అవసరాన్ని వివరించారు.

కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన నటీనటులు కళాకారులు, వైజాగ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ నిర్వాహకులు, ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here