మంగళగిరి నియోజకవర్గంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన

Spread the love

 మంగళగిరి నియోజకవర్గంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన

దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారిని నారా లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఆ తరవాత చుట్టు పక్కల గ్రామాల నుండి తనని కలవడానికి వచ్చిన ప్రజలను కలిసి వారి నుండి వినతులు స్వీకరించారు, అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *