భూ బాధితులకు అండగా ఉంటాం

2
0

భూ బాధితులకు అండగా ఉంటాం

పేదల పక్షాన పోరాడుతాం

మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్

పశ్చిమ లోని జోజి నగర్,
ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్ల యజమానులు అధైర్యపడోద్దని, వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ సీనియర్ నాయకులు మైలవరపు కృష్ణ స్పష్టం చేశారు..

బుధవారం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణ, కూటమి నేతలతో కలిసి 45 వ డివిజన్
జోజి నగర్ లోని
42 ప్లాట్ల బాధితులకు సంఘీభావం తెలిపి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో విశాఖ ,హైదరాబాదు లాంటి నగరాలలో పేదలను మోసం చేసే సంస్కృతి ఉండేదని అలాంటి నీచ సంస్కృతి విజయవాడ నగరంలో కూడా మొదలైందన్నారు .
పేదలు, మధ్యతరగతి ప్రజలు చెమటోడ్చి ప్లాట్లు కొనుగోలు చేసుకుని, ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటుంటే, కొంతమంది వ్యక్తులు రాజకీయం ముసుగులో పేదల ఆస్తిని దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారని కూటమి ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించదన్నారు.
జోజి నగర్ లో ఉన్న 2 ఎకరాల 15 సెంట్లు సుమారు
రూ 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు
మజీద్ అనే వ్యక్తి కొంతమంది ఫేక్ సొసైటీ దుష్టశక్తులు తుళ్లూరులో దొంగతనంగా రిజిస్ట్రేషన్లను చేయించారన్నారు. 2022 లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ను బాధితులు కలిసినప్పటికీ వారికి న్యాయం జరగలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేని వారు ఇప్పుడు బాధితులకు సంఘీభావం తెలపడం హాస్యాస్పదమన్నారు. అమాయకులైన, 42 కుటుంబాలు 300 మంది పేద ,మధ్య తరగతి ప్రజలు గత 28 రోజులుగా తమకు దక్కవలసిన ప్లాట్ల కొరకు న్యాయపరంగా ఆందోళన చేస్తున్నారని , వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని భరోసానిచ్చారు.
పశ్చిమలో ఇటువంటి నీచ సంస్కృతికి చోటు లేదన్నారు.
దందాలు, చందాలు లేకుండా రాజకీయాలకతీతంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పాలన ఉందని బాధితులకి ఆయన అండగా ఉన్నారని తెలిపారు. ఇటీవల బాధితులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిసినప్పుడు వారికి న్యాయం జరిగేలా సానుకూలంగా స్పందించారని తెలిపారు . బాధితుల విషయంలో సుప్రీంకోర్టు ఎస్ .ఎల్. పీ
( స్పెషల్ లీవ్ పిటీషన్ ) ను అంగీకరించడం , అడ్మిట్ నెంబర్ ను కేటాయించడం హర్షణీయమన్నారు.
పశ్చిమ ప్రజలు కూడా బాధితుల పోరాటానికి మద్దతు తెలపాలన్నారు .
ఖాళీ స్థలాలను కబ్జా చేసి కోట్లు దండుకునే ముఠాపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలన్నారు .
ఇప్పటికే నగర కమిషనర్ రాజశేఖర్ బాబును, కలెక్టర్ ను కలిసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరమన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఉన్న పశ్చిమాన్ని కబ్జాల పేరుతో అలజడి సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని జలీల్ ఖాన్ హెచ్చరించారు..
మీడియా మిత్రులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 42 మంది బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జలీల్ ఖాన్ కోరారు..

అక్రమార్జనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు పేద మధ్యతరగతి ప్రజల నుంచి నుంచి కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి పన్నాగం పన్నారని టిడిపి సీనియర్ నాయకులు మైలవరపు కృష్ణ పేర్కొన్నారు..
ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, కలెక్టర్, కమిషనర్ కు తెలియజేశామన్నారు..
జోజి నగర్ బాధితులకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు..
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు రాంపల్లి శ్రీనివాస్, సయ్యద్ సలీం, ప్రసాదం బాలు, పత్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here