భూసేకరణ వల్ల చిన్న రైతులు మరియు వ్యవసాయ కూలీల జీవన హక్కుల కోల్పోతున్న స్థితిగతులు – ఒక సామాజిక–ఆర్థిక అధ్యయనం
సవరించిన భూసేకరణ చట్టం 2018 ప్రకారం భూ సేకరణ జరిగితే సమిదలు అయ్యేది బక్కచెక్కిన రైతులు కౌలు రైతులు రైతు కూలీలు అన్న అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వర రావు ఒక నివేదికను తయారు చేసే విజయవాడ ప్రెస్ క్లబ్ లో 5th August 2025 న విడుదల చేయడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి, రామాయపట్నం, రావూరు, చేవూరు, కరేడు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణల వల్ల చిన్న రైతులు మరియు వ్యవసాయ కూలీలు పరిస్థితి మీద మాట్లాడటం జరిగింది
గతంలో జరిగిన భూసేకరణలో రైతుల భూమికి పరిహారం లభించినా, ఉపాధి కోల్పోయిన వారికీ, ప్రత్యేకించి వ్యవసాయ కూలీలకు,ఏ రకమైన పరిహారం లేకపోవడాన్ని మేము ఇచ్చిన నివేదిక లో గమనించవచ్చు అని మాట్లాడడం జరిగింది
.
రామాయపట్నం పోర్టు నిర్మాణం, అమరావతి రాజధాని భూసేకరణ వంటి పలు ప్రాజెక్టుల సందర్భంగా వాస్తవంగా జీవనోపాధిని కోల్పోతున్న వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఉపాధిలేక వలసలు వెళుతున్న పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరం లేదు అని జీవోలు ఇవ్వడం అంటే ప్రభుత్వాలు పేదల జీవితాలను పణంగా పెట్టి కార్పొరేట్ లకు రైతుల భూములను ఎలా కట్టబెడుతున్నాయో అర్ధం అవుతుందని మాట్లాడటం జరిగింది
ఈ సందర్భంగా నివేదిక లోని అంశాలను మీడియా కి విడుదల చేయడం జరిగింది
1) ప్రధాన అంశాలు:
అభివృద్ధి పేరిట భూసేకరణ జరుగుతున్న, గ్రామీణ పేద రైతులు మరియు వ్యవసాయ కూలీలు జీవనోపాధిని కోల్పోతున్నారు
Article 21 ప్రకారం జీవన హక్కు ఉల్లంఘన జరుగుతుంది.
రైతులకు కొంత పరిహారం లభించినా, వ్యవసాయ కూలీలు పూర్తిగా నిర్లక్ష్యంకు గురవుతున్నారు.
Social Impact Assessment (SIA) లేకుండా అనేక ప్రాజెక్టులు నడిపిస్తున్నాయి.
2) గుర్తించిన సమస్యలు:
ఉపాధి కోల్పోవడం: రైతు కూలీలు భూ సేకరణ జరిగితే రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి కూలీ చేయాల్సిన పరిస్థితి.
రామాయపట్నం పోర్ట్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల్లో స్థానికులకు ఉద్యోగాలు లభించలేదు.
3)జీవితకాల ఆదాయం నష్టం:
భూమి పోతే ఉపాధి పోతుంది వ్యవసాయం సంబంధించిన నైపుణ్యం తప్ప ఎలాంటి నైపుణ్యం లేని రైతులు రైతు కూలీలు భూ సేకరణ తర్వాత సర్వం కోల్పోబోతున్న పరిస్థితి
25 ఏళ్ల రైతు కూలీ కుటుంబానికి మిగిలిన జీవితకాలంలో జరిగే ఆదాయ నష్టం: ₹58.8 లక్షలు
35 ఏళ్ల సరాసరి వయసున్న రైతు కూలీ కుటుంబానికి మిగిలిన జీవితకాలంలో జరిగే ఆదాయ నష్టం: ₹42 లక్షలు
భూమి ఉన్న చిన్న రైతులు తమ భూమికి కొంత పరివారం వచ్చిన జీవితకాలం సంపాదించే ఆదాయాన్ని కోల్పోబోతున్న పరిస్థితి.
4)చట్టపరమైన అంశాలు:
Article 21 – జీవనోపాధి హక్కు
భూసేకరణ చట్టం (2013) ప్రకారం SIA తప్పనిసరి, కానీ మినహాయింపులు ఇచ్చి పేదల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పులు కూడా జీవనోపాధి హక్కును సమర్థించాయి.
5)సూచనలు
ఆదాయ నష్టానికి సమగ్ర పరిహారం – జీవితకాల ఆదాయం ప్రకారం రెవిన్యూ మరియు ఇతర నిపుణుల సహాయంతో ప్రభుత్వమే నిర్ణయించాలి
భూసేకరణకు ముందు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
.ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి
SIA తప్పనిసరి అమలు చేయాలి అప్పుడే భూసేకరణ ప్రక్రియ ముందుకు వెళ్లాలా వద్దా అన్న దానిమీద స్పష్టత వస్తుంది
ఉపాధి భరోసా/ప్రత్యామ్నాయ ఉపాధి చూపించిన తరువాతే భూసేకరణ గురించి ఆలోచించాలి
భూసేకరణ అనేది సమగ్ర ప్రణాళికతో, పేదల జీవన హక్కులను గౌరవిస్తూ జరగాలి. అభివృద్ధి పేరు మీద వారు బలికాకూడదు. సమర్థవంతమైన పరిహారం, ఉపాధి భద్రత, పునరావాసం లేని భూసేకరణ అమానవీయమవుతుంది.అలాంటి భూసేకరణ కి ప్రభుత్వాలు దుర్గంగా ఉండాలి అని కోరుకొంటున్నాము అని మాట్లాడటం జరిగింది
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పర్వతనేని హరికృష్ణ కందుల పరమేశ్వర్ పాల్గొన్నారు