భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..

Spread the love

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..

గన్నవరం: నవంబరు 16, 2025

మంగళగిరిలో కార్యక్రమం ముగించుకుని పుట్టపర్తికి పయనమయ్యేందుకు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఘనంగా వీడ్కోలు పలికారు.

అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు తదితరులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

Loading