భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీయ ప్రెస్ మీట్*విజయవాడ లంకా దినకర్,బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి

5
0


 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ ఎన్డీయ ప్రెస్ మీట్*విజయవాడ

లంకా దినకర్,బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి

హృదయం ప్రతినిధిప్రధాని మోదీ మొదటి ప్రచార దశలో భాగంగా 17మార్చి లో చిలకలూరిపేటలో జరిగిన కూటమి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది 

ఈ నెల లో మోదీ మరొకసారి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు 

మే 6వ తేదీన రాజమండ్రి లో కూటమి పార్లమెంట్ అభ్యర్థి పురందేశ్వరి విజయాన్ని కోరుతూ భారీ బహిరంగ సభలో ప్రజలని ఉద్దేశించి మాట్లాడతారు 

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజలని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడతారు  బిజెపి పార్లమెంటు అభ్యర్థి సిఎం రమేష్  ఆహ్వానం పలుకుతారు 

అలాగే 8వ తేదీన రాజంపేటలో పార్లమెంట్ కూటమి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని కోరుతూ మోదీ ప్రశంగించునున్నారు 

అదే రోజు సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు NDA కూటమి గెలుపు కొరకు రోడ్ షో లో ప్రధాని మోదీ పాల్గొంటారు 

రాష్ట్రంలో డబల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, విద్వంస పాలన కి స్వస్తి పలకాలని ప్రజలని కోరుతున్నాము 

త్రివేణి సంగమం లా బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లటానికి  శ్రీకారం చుట్టాము 

వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర నినాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలని కోరుతున్నాము 

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి స్వస్తి పలికెందుకు కూటమి ఏర్పడాల్సి వచ్చింది 

ప్రధాని స్థాయి లో మోదీ ఏపీ కి రావటం శుభదాయకం 

జగన్ పాలన లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం చాలా దురదృష్టకరం 

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు మోదీ, చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవసరం 

మోదీ ఏపీ లో చేపడుతున్న బహిరంగ సభ అనేది NDA కూటమికి బలాన్ని చేకూరుతుంది 

ఖచ్చితంగా మోదీ సభలు విజయవంతం కానున్నాయి 

జనసేన నేత గౌతమ్

5కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి భరోసా కలిపించేందుకు మోదీ సభ లు నిర్వహించటం ఆనందంగా ఉంది 

కూటమి పార్టీ గెలుపొందెందుకు సిద్ధంగా ఉంది 

2024 ఎన్నికల ఫలితాల్లో NDA కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది

నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలని జన సైనికులకు పిలుపు ఇచ్చారు 

పాత్రికేయుల సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిడ్డి శ్రీ నివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ.పర్యటన వివరాలు 

 ప్రధాని నరేంద్ర మోడీ  మొదటి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తో కలిసి  17 మార్చ్ 2024న చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో 10 లక్షల మంది పైగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు హాజరై సభను నభూతో నభవిష్యత్తు అన్న విధంగా దిగ్విజయం చేశారు.

ఇప్పుడు రెండవ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి భారీ బహిరంగ సభల్లో మరియు ర్యాలీ లో పాల్గొనేటటువంటి షెడ్యూల్ ని విడుదల చేయడానికి ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని ఎన్డీఏ నాయకులుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది.

ఈనెల 6వ తేదీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి సభ ప్రాంగణం వేమగిరి, జాతీయ రహదారి 16,  రాజమండ్రి రూరల్ అసెంబ్లీ వద్ద మధ్యాహ్నం 3.30 చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు టీడీపీ,జనసేన బలపరిచిన 

రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు చంద్రబాబు నాయుడు  మరియు పవన్ కళ్యాణ్  తో కలసి ప్రజలను ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు.

అలాగే ఈ నెల 6తేదీ సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ  5 గంటల 55 నిమిషాలకు సాన్ యూఫోరియా లేఅవుట్, ఊగిని పాలెం పంచాయితీ, కసిమికోట మండలం, అనకాపల్లి చేరుకొని టీడీపీ,జనసేన బలపరిచిన అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్  ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు  మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తో కలసి ప్రజలను ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు.

ఈనెల ఈనెల 8వ తారీకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి విమానాశ్రయానికి చేరుకొని పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి సభ ప్రాంగణం వద్దకు మధ్యాహ్నం 3 గంటలకి టీడీపీ,జనసేన బలపరిచిన రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు  మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తో కలసి ప్రజలను ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు

అలాగే 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు, అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు, మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తో కలసి స్థానిక ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి రోడ్ షో లో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here