భవాని దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్ మరియు పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ . ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.08.11.2025.

భవాని దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్ మరియు పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ . ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కలిసే విధంగా భక్తుల సౌకర్యార్ధం అవసరమైన ప్రదేశాలలో ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఏర్పాటు చేయుట గురించి చర్చించారు.

భవాని భక్తులందరూ ఈ ప్రత్యేకమైన యాప్ లో రిజిస్టర్ అయ్యేవిధంగా తీసుకోను చర్యల గురించి చర్చించారు.

ది.11.12.2025 తేదీ నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.15.12.2025 తేదీన జరుగు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ఇరుముళ్లను (దీక్షా విరమణ) సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారులతో భవాని దీక్ష విరమణ బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమీక్షా సమావేశంలో ది.11.12.2025 తేదీ నుండి ది.15.12.2025 తేదీ వరకు భవాని దీక్ష విరమణ లకు చేయి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, హోల్డింగ్ ఏరియాలను ఉపయోగించుకుని క్యూలైన్లలో రద్ది, స్నానఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా మరియు గిరి ప్రదక్షణ సమయంలో భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా మరియు సామాన్య ప్రజలు, వాహనధారులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కూలంకషంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేవిధంగా, భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కలిసే విధంగా భక్తుల సౌకర్యార్ధం అవసరమైన ప్రదేశాలలో ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఏర్పాటు చేయుట గురించి చర్చించారు. గిరి ప్రదక్షణ సమయంలో ట్రాఫిక్ నిర్వహణ మరియు బందోబస్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

 ప్రత్యేకంగా భవాని దీక్ష విరమణ చేయడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మరియు సమాచార నిమిత్తం, వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి వీలుగా గత సంవత్సరం రూపొంధించిన ప్రత్యేకమైన యాప్ ను ఆధునీకరణం చేసి దానిలో భక్తులకు అమ్మవారి దర్శనం వివరాలు, ముందస్తు సమాచారం మరియు ప్రసాదలను ఆన్లైన్ ద్వారా ముందుగా బుక్ చేసుకునే విధంగా, బుక్ చేసుకున్న వారికి ప్రసాదాలు కౌంటర్ నందు త్వరగా ఇచ్చేవిధంగా, పార్కింగ్ ప్రదేశాలు, మెడికల్ పాయింట్లు, త్రాగునీరు ప్రదేశాలు, సమాచార కేంద్రం, గిరి ప్రదక్షణ, దర్శన సమయాలు పూజా విధానం మొదలగు అంశాలు అన్ని యాప్ లోనే ఉండేవిధంగా చూసుకోవాలని, దీని ద్వారా భవాని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి,  అంతేకాకుండా విరమణ నిమిత్తం వచ్చు భక్తులకు ఒక యాప్ లోనే పూర్తి సమాచారం అందే విధంగా ఉండేలా యాప్ ను రూపొందించాలని దేవస్థాన ఐటీ అధికారులకు  సూచనలు చేసినారు. దీని ద్వారా దీక్ష విరమణకు వచ్చిన భక్తులు సులభంగా సమాచారం తెలుసుకుని త్వరితగతిన వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడం జరుగుతుందని తెలిపినారు. దీని ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించిన వారము అవుతామని తెలిపినారు.

       ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు, డి.సి.పి.  కృష్ణ కాంత్ పాటిల్ ఐ.పి.ఎస్.గారు, టెంపుల్ ఈ.ఓ.  శ్రీనానాయక్ ఎ.డి.సి.పి జి.రామకృష్ణ ,  ఏ.సి.పి.  దుర్గారావు ఇనస్పెక్టర్  గురు ప్రకాష్ దేవస్థాన అధికారులు, దేవస్థాన ఐ. టి & ఇంజనీరింగ్ అధికారులు మరియు  సిబ్బంది పాల్గొన్నారు.

Loading