భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

2
0

భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

ఇఫ్టూ భవన నిర్మాణ కార్మిక సంఘాల విలీన సభ డిమాండ్

  ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు అయిన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీనం సందర్భంగా ఈరోజు 30వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన  ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కె. పోలారి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నీరుగార్చిన భవన నిర్మాణ కార్మికుల బి.ఓ.సి బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం, అంతకు ముందటి ప్రభుత్వం కూడా బోర్డు నిధులను దారిమల్లించి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారని గుర్తుచేశారు. హరప్పా, మొహంజదారో పురాతన నాగరికతల దగ్గర్నుంచి నేటి ఆధునిక నాగరిక సమాజం వరకు రహదారులు, బిల్డింగులు, ఆకాశ హార్మయాలు నిర్మించిన, నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికులు పారిశ్రామిక, సంఘటీత, అసంఘీటీత కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయిలో ఉండటం చాలా బాధాకరమని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా బోర్డులు ఏర్పడ్డాయని అదేవిధంగా నిర్మాణదారుల నుండి ఒక శాతం సెస్సును నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. 2019 ముందు అప్పటి ప్రభుత్వం రాష్ట్రములో 1200 కోట్ల రూపాయలను దారిమల్లిస్తే, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం బోర్డులో ఉన్న  మొత్తం సొమ్మును ఊడ్చుకుని పోయిందని అన్నారు. గత ఏడేళ్లుగా వేలాదిగా అనేక క్లెయిమ్ లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు.. ఎన్నికలకు ముందు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారానికి వచ్చి ఏడాది అయిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలని, పెండింగ్ క్లెయిమ్ లను పరిష్కరించాలని, కొత్త దరఖాస్తులు స్వీకరించాలని, సభ్యత్వాలను కూడా నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. వీటి కోసం భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. అన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాలను ఐక్య కార్యాచరణలోకి తీసుకొచ్చేందుకు ఐఎఫ్టియు కృషి చేస్తుందని కార్మికులకు తెలియజేశారు. అలాగే  బివోసి చట్టంతో సహా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబరు కోడ్లను తీసుకొని వస్తున్న మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9 న జరుగు సార్వత్రిక సమ్మె ను కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా జయప్రదం చేయాలన్నారు. ఇఫ్టూ ఉపాధ్యక్షులు ఆర్ మోహన్ మాట్లాడితూ  రెండు సంఘాలను ఒకే సంఘం విలీనం చేస్తూ ఇకపై ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం పేరుతో పనిచేస్తుందని  ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభకు హాజరైన ప్రతినిధులు ఆమోదించారు. అదేవిధంగా సంఘానికి అధ్యక్షులుగా ఆర్ మోహన్ ప్రధాన కార్యదర్శిగా కె.వి రమణ ఉపాధ్యక్షులుగా ఏసురత్నం సహాయ కార్యదర్శిగా ఎం నాగరాజు కోశాధికారిగా గుబ్బల ఆదినారాయణ మరో 12 మంది కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర కమిటీని రిలీవ్ కానున్న ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. నూతన రాష్ట్ర కమిటీని అభినందిస్తూ ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ ప్రశాంగించారు. సంక్షేమ పధకాలు మన హక్కు అని వాటికోసం పోరాడుతూనే భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని పటిష్టం చేసుకోవాలన్నారు. జిల్లాలపై కేంద్రీకరించి సభ్యత్వ నమోదు పెంచుకోవాలన్నారు. సమరశీల పోరాటలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. ఇంకా ఈ సభలో  ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.వి రమణ కూడా ప్రసంగించారు. ఏలూరు అరుణోదయ కళాకారులు శ్రామిక గీతాలను ఆలపించారు. ఎనిమిది జిల్లాల నుండి 75 మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here