
విజయవాడ
భక్త కనకదాస జీవితం ఆదర్శనీయం..
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో రచనలు చేసిన ప్రముఖ తత్వవేత్త సంగీతకారుడు స్వరకర్త భక్త కనకదాస జీవితం నేటి తరానికి ఆదర్శదాయకమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కనకదాస జయంతి వేడుకులకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ హాజరై కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామధ్యాన చరిత్ర, మోహన తరంగిణి వంటి ప్రధాన రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయాని కనకదాస జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షను రూపుమాపడంలో కనకదాస రచనలు ఎంతో దోహదపడతాయన్నారు. ఆయన జయంతిని పరస్కరించుకుని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
డిఆర్వో ఎం. లక్ష్మీనరసింహాం, జిల్లా బిసీ సంక్షేమ అధికారిణి డి. లక్ష్మీదేవి, డివిజనల్ సంక్షేమ అధికారులు ఆర్. రవిప్రసాదరావు, పి. శ్రీనివాసరావు, వార్డెన్లు ఎం. రజని, విజయదుర్గ, మేరి జాన్సన్, సూపరింటెండ్ పి. రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
![]()
