బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కింద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పై నగర కమిషనర్ పరిశీలన

Spread the love

విజయవాడ నగర పాలక సంస్థ

26-06-2024

 బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కింద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పై నగర కమిషనర్ పరిశీలన

 నిత్యం రద్దీగా ఉండే యం జి రోడ్, బెంజ్ సర్కిల్ జంక్షన్ గల ఫ్లైఓవర్ కింద ప్రాంతమును విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బ్యూటీఫికేషన్ కై అధికారులకు ఇచ్చిన ఆదేశాలు పై బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

 కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  ప్రధానమైన జంక్షన్లో బెంజ్ సర్కిల్ జంక్షన్ ఒకటైనందున, కాలుష్యానికి తగ్గించే దిశగా గ్రీనరీ ని పెంచమని, వర్షం వల్ల  రోడ్లు నిండి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సైడ్ డ్రైన్లలో సిల్ట్ తీయడమే కాకుండా, డ్రైన్ లో నీరు ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని గతంలో  అధికారులకు ఇచ్చిన ఆదేశాలు పై క్షేత్రస్థాయిలో పరిశీలించి, గ్రీనరీ నిర్వహణ సరిగా లేదని గమనించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్  చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  పనిలో అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్లక్ష్యం వహిస్తే వెంటనే కఠిన చర్యలు తప్పవని   హెచ్చరించారు. 

 ఈ పర్యటనలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్ ) కె.సత్యవతి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ ) జి.సృజన, జోనల్ కమిషనర్ 3 శివరామకృష్ణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్ )ఏ యస్ ఎన్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 3 సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *