బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తా
విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ బాడిస రూపేష్
విజయవాడ:
బీసీల అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన రూపేష్ స్పష్టం చేశారు. బీసీలు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధి కోసం ఆర్ కృష్ణయ్య నేత్రతంలోని బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని వెల్లడించారు. గురువారం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా విజయవాడ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీ రుపేష్ నియామక పత్రాన్ని అందుకున్నారు. విజయవాడ సిటీ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిల్ల శ్రీకాంత్ ను నియమించినట్లు ఆయన తెలిపారు. నియమకా పత్రాన్ని అందజేసిన వారిలో విజయవాడ అధ్యక్షులు కనిశెట్టి లక్ష్మణరావు, పిసా అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరావులు ఉన్నారు. రాష్ట్ర ఇంచార్జ్ నూకానమ్మ వారి ఆదేశానుసారంనియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామని, తనపై మహాత్ర బాధ్యతను ఉంచిన ఆర్ కృష్ణయ్యకు, వై నాగేశ్వరావుకు, వై నూకానమ్మకు ధన్యవాదాలు తెలిపారు.