బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. దీంతో, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం దానంపై వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అపాయింట్ మెంట్ తీసుకున్న బీఆర్ఎస్ నేతలు నిన్న సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లారు. స్పీకర్ నివాసానికి వెళ్లిన వారిలో మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్ ఉన్నారు.
![]()

