బియ్యం ఎగుమతులకు సహకారం – మార్గదర్శకాలు విడుదల-బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం : మంత్రి నాదెండ్ల మనోహర్

1
0

బియ్యం ఎగుమతులకు సహకారం – మార్గదర్శకాలు విడుదల-
బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం : మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి, 9-7-2025

రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎగుమతి దారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సులభంగా ఎగుమతులు చేసుకోవచ్చని సూచించారు.

మంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని మంత్రి చాంబర్‌లో కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:
రాష్ట్రంలో నుంచి బయటకు వెళ్ళే బియ్యం సరఫరాలో PDS (సబ్సిడీ) బియ్యం కలిపే ప్రసక్తే లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే నమోదవుతున్న 6A కేసులతో పాటు PD యాక్ట్, BNS సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు పోర్టు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24/7 సిబ్బంది తో తనిఖీలు చేపట్టాలని, అవసరమైతే చెక్‌పోస్టులు పెంచాలని సూచించారు.

కాకినాడ పోర్ట్ వద్ద PDS బియ్యం నియంత్రణ బాగా జరుగుతోందని, అలాగే విశాఖ, నెల్లూరు పోర్ట్ ప్రాంతాలను కూడా మరింత పటిష్టం చేయాలని సూచించారు.

విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు.

జాతీయ రహదారులపై కూడా అవసరమయ్యే చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.

అక్రమ రవాణా కేసుల వివరాలు:

కాకినాడ జిల్లాలో మొత్తం 85 కేసులు, అందులో 21 కేసులు పోర్ట్ ఏరియాలో.

విశాఖపట్నం జిల్లాలో 92 కేసులు, అందులో 9 పోర్ట్ ప్రాంతానికి.

నెల్లూరు జిల్లాలో 62 కేసులు, అందులో 6 కేసులు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here