భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ సారథ్యంలో సాధించిన విజయాల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను రాష్ట్ర కార్యాలయం లో బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు .
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ మార్గ నిర్దేశం లో పనిచేస్తున్నామన్నారు.
స్వతంత్ర భారతావనిలో నరేంద్ర మోడీ పాలనే దేశాభివృద్ధికి బాటలు వేయడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఆశీస్సులు తో ఎన్ డి ఎ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ తో కూడిన పాలన అందిస్తోందన్నారు.
పేదలకు జాతీయ స్థాయిలో సంక్షేమం అన్ని వర్గాలకు అందుతోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 15రోజుల పాటు సేవాకార్యక్రమాలు పార్టీ నేతృత్వంలో జరుగుతాయన్నారు
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ నివాస్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, సేవా కార్యక్రమాలు ఇంఛార్జి పాటిబండ్ల రామ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, మువ్వల వెంకట సుబ్బయ్య, కృష్ణ భగవాన్ తదితరులు పాల్గొన్నారు