బిజెపి ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సుజనా చౌదరి భేటీ
తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీ లతో భేటీ నిర్వహించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ను అసెంబ్లీ ప్రవేశ పెట్టిన తర్వాత నేతలు భేటీ అయ్యారు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మరియు బిజెపి ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఎనిమిది నెలలు గా కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసారు.. ఏపీలో బిజెపిని బలోపేతం చేయటం వంటి పలు అంశాలపై చర్చించారు.
సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్, అనకాపల్లి ఎంపీ సి యం రమేష్, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్,బీజేపీ సంఘటన జనరల్ సెక్రెటరీ మధుకర్ జి తదితరులు పాల్గొన్నారు