బిజెపిలో చేరిన వైసిపి కార్పొరేటర్

Spread the love

 బిజెపిలో చేరిన వైసిపి కార్పొరేటర్ 

పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి కి మరోసారి షాక్ తగిలింది. 39 వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్ లోని పురందేశ్వరి నివాసంలో  కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే పశ్చిమ లోని వైసిపి కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, హర్షద్, మైలవరపు మాధురి లావణ్య, టిడిపి ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టిడిపి లొ చేరారు. తాజాగా గుడివాడ నరేంద్ర రాఘవ కూడ చేరడంతో అనేకమంది కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా కూటమి అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *