
బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన యార్లగడ్డ
గన్నవరం :
మండల పరిధిలోని దావాజీగూడెం గ్రామంలో గల బాలికల వసతి గృహాలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకస్మికి తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం గ్రామంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలను తనిఖీ చేసిన ఆయన బాలికల వసతి గదులను, భోజనశాలను, మెనూ పరిశీలించి విద్యార్థినిలకు పెడుతున్న ఆహారాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థినిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వసతి గృహం లో ఉంటున్న బాలికలకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలికల భద్రతపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మసతి గృహ అధికారులను ఆదేశించారు. బాలికల వసతి గృహాల వద్ద కు అకతాయిల రాకుండా పోలీసులు పర్యవేక్షించాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. స్థానికులు పలు సమస్యలను యార్లగడ్డ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన వాటిని పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, తహసిల్దార్ శివయ్య, ఎంపీడీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
![]()
