Home Political news బాపూజీ విద్యాలయంలో దిగ్విజయంగా జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు….

బాపూజీ విద్యాలయంలో దిగ్విజయంగా జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు….

2
0

 బాపూజీ విద్యాలయంలో దిగ్విజయంగా జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు….

*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో అద్భుతంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు*……

మంగళగిరి లోని ఆత్మకూరు బాపూజీ విద్యాలయంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వ్రత మహోత్సవాలు శనివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ధార్మిక చైతన్య సదస్సు, ప్రసాద వితరణ జరిగింది. గోదాదేవికి దీక్షాపరులు, భక్తులు సారె 500 మందితో సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులను దీవించి పండ్లు ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు, కూచిపూడి నృత్యాలు అత్యంత వైభవంగా ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఈ ప్రాంతమంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తి వచనాలను భక్తులు ఎంత శ్రద్ధతో ఆలకించారు. ఈ మహోత్సవ కార్యక్రమాలను బాపూజీ విద్యాలయం అధినేత యర్రాకుల తులసిరామ్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here