బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

కుటుంబ పెద్దను పోగొట్టుకొని తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగిస్తున్న గుమ్మా వెంకటలక్ష్మి కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందించారు.

40 వ డివిజన్ , బాలకోటయ్య వీధికి చెందిన గుమ్మా నాగేశ్వరరావు (50) వెల్డింగ్ వర్క్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు

అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 20 న మృతి చెందాడు..

కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబానికి సాయం అందించాలని మాజీ కార్పొరేటర్ ఆలుగుండ్ల సుబ్బారెడ్డి ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లారు..

ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది,40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీ వీ చిన సుబ్బయ్య తో కలిసి వారి నివాసానికి వెళ్లి రూ 5000 వేలను ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు..

కూటమి నేతలు అడుసుమల్లి వెంకటేశ్వరరావు , మన్నెం నారాయణ రావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు..

Loading