బాధితులకు మనిషికి వెయ్యి రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి 3 వేల రూపాయలు అందించాలి

Spread the love

తుఫాన్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో తుఫాన్ నష్టాలను నివారించగలిగాం

బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, రెండు రకాల కూరగాయలు కేజీ చొప్పున అందించాలి

చేనేత, మత్స్యకార కుటుంబాలకు అదనంగా 25 కేజీల బియ్యం

బాధితులకు మనిషికి వెయ్యి రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి 3 వేల రూపాయలు అందించాలి

పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చూడాలి. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

నదులు, చెరువులు, వాగులు, కాలువల గట్ల పటిష్టతను పరిశీలించాలి

తుఫాన్ సహాయక చర్యలపై అధికారులతో జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష

          ఏలూరు, అక్టోబర్, 29 : జిల్లాలో తుఫాన్ సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలనీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం తుఫాన్ సహాయక కార్యక్రమాలపై  రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి మరియు  తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా  ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే,  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, తో కలిసి  అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో మొంథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నేతలు  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని, వాటిని అధికారులు పరిష్కరించడం నష్టాన్ని నివారించగలిగామన్నారు.   జిల్లా యంత్రాంగం మనసు పెట్టి మంచి స్పూర్తితో పనిచేశారని, అదే స్పూర్తితో తుఫాన్ అనంతరం సహాయక కార్యక్రమాలను  ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో  చేపట్టాలని, వాటితో పాటు  ఆస్థి, పంట, పశు  నష్టం అంచనాలను ఈనెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలనీ మంత్రి చెప్పారు.  భారీ వర్షాల అనంతరం జిలాల్లో ఎక్కడా అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాలూ, పట్టణ ,నగరాలలో పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నదులు, చెరువులు, వాగులు, కాలువల గట్ల పటిష్టతను పరిశీలించాలని, బలహీనంగా గట్లను పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో 90 తుఫాన్ సహాయక కేంద్రాలు ఏర్పాటుచేసి, 3422 కుటుంబాలకు చెందిన 7 వేల మందికి  భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాలో తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో  సహాయక శిబిరాలు బుధవారం రాత్రి వరకు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలకు కేంద్రం నుండి వెళ్లే సమయం.ఓ కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, రెండు రకాల కూరగాయలు  కేజీ చొప్పున అందించడం జరుగుతుందని,  చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు అదనంగా 25 కేజీల బియ్యం అందించడం జరుగుతుందన్నారు. బాధితులకు మనిషికి  వెయ్యి రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి 3 వేల రూపాయలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  జిల్లాలో పంట నష్టాల అంచనాలను ఈనెల 30వ తేదీ లోగా పూర్తిచేయాలని, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో వారి శాఖలను సంబంధించి పంట నష్టాలను పరిశీలించి వెంటనే నివేదికలను సమర్పించాలన్నారు. జిల్లాలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే పునర్నిర్మించాలన్నారు. జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని రేషన్ షాపులలో రెండు రోజులు ముందుంగానే  అత్యవసరంగా నిత్యావసర సరుకులను సిద్ధం చేశామన్నారు.     
         రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి మరియు  తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా  ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ విపత్తు నివారణ నిర్వహణలో  జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని  సమిష్టిగా పనిచేయడంతో తుఫాన్ నష్టాలను తగ్గించగలిగామని, ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత లంక గ్రామాలలో ప్రజలు తుఫాన్ కారణంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా అధికారులు తీసుకున్న చర్యలను, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఇటువంటి  కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. తుఫాన్ అనంతరం సహాయక చర్యలను కూడా అదే స్పూర్తితో అధికారులు, సిబ్బంది చేపట్టాలన్నారు. 

        జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తుఫాన్ ప్రత్యేక అధికారులు అందించిన సూచనలతో  తుఫాన్ కు ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. జిల్లాలో అధికారులు, సిబ్బంది అందరూ విపత్తు సమయంలో బాధ్యతగా పనిచేసి ప్రాణ, ఆస్థి, పశు నష్టం జరగకుండా చూడగలిగారన్నారు. 

        ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Loading