
బాధితులకు ఎల్ఓసి లు అందజేత
విజయవాడ
ఎన్డీఏ కార్యాలయంలో అందజేసిన 53 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి ఉదయ భాస్కర్, 49 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న ,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
53 వ డివిజన్ , చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన కోరగంజి భవేష్ సూర్య( 3)కు మంజూరైన రూ 25 లక్షల
ఎల్ .ఓ. సీ
(లెటర్ ఆఫ్ క్రెడిట్) ను భవేష్ కుటుంబ సభ్యులకు ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.
53వ డివిజన్, చేపల మార్కెట్ కు చెందిన కోరగంజి భవేష్ (3 ) తలసేమియా తో బాధపడుతూ చెన్నై లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .
చిన్నారి భవేష్ కు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో
ఎల్. ఓ సీ .కొరకు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 25 లక్షల ఎల్. ఓ. సీ ను 53 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి ఉదయ భాస్కర్, 49 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి అందజేశారు .
అదేవిధంగా 35 వ డివిజన్ పూర్ణ నందం పేటకు చెందిన బీ చైతన్య శాంత కుమారి గర్భాశయ సమస్యతో బాధపడుతూ ఎల్ ఓసీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 1 లక్ష 47వేల ఎల్ ఓసీ ను అందజేశారు.
త్వరితగతిన
ఎల్ .ఓ. సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాయన హే రంభ కుమార్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు…
![]()
