బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియం అభివృద్ధికి స‌మిష్టిగా కృషి చేస్తాము అని

Spread the love

 -21-08-2024

59వ డివిజన్ సింగ్ నగర్

ధి;21-8-2024 బుధవారం ఈరోజు ఉదయం 11:00″గం లకు”సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియం అభివృద్ధికి స‌మిష్టిగా కృషి చేస్తాము అని

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ,సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్టేడియంను సందర్శించారు.

ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ;- యువ‌త క్రీడ‌ల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్ని స‌మిష్టిగా అభివృద్ది చేస్తామ‌ని MLA బోండా ఉమ ,MP కేశినేని శివ‌నాథ్ గార్లు అన్నారు. అజిత్ సింగ్ న‌గ‌ర్ లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్నిబుధ‌వారం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎంపి కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు. 

స్టే డియంలో వ‌ర్షం ప‌డిన‌ప్పుడు గ్రౌండ్ లో నీళ్లు నిలిచిపోతున్న విష‌యం చెప్ప‌టంతో పాటు, కొంత‌ మెర‌క లేపాల్సిన అవ‌స‌రం వుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఎమ్మెల్యే బొండా ఉమా వివ‌రించారు. స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కావాల్సిన విధంగా స్టేడియంను తీర్చిదిద్ద‌టంతోపాటు మౌళిక‌ స‌దుపాయాలు ఏర్పాటు చేసేందుకు MLA బొండా ఉమా తో క‌లిసి స‌మిష్టిగా కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మంలో;- టిడిపి రాష్ట్ర కార్యదర్శి,సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ మ‌హిళ అధ్య‌క్షురాలు దాస‌రి ఉద‌య‌శ్రీ, దాసరి దుర్గారావు, బెజ్జం జైపాల్, Sk బాషా త‌దిత‌రులు పాల్గొన్నారు….

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *