బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడి ఆవేదన మంత్రి లోకేష్ వరకూ చేరుకుంది

Spread the love

 బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడి ఆవేదన మంత్రి లోకేష్ వరకూ చేరుకుంది

. కువైట్‌లో వేధింపులకు గురవుతూ తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయన సేవ్ చేస్తుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా నెల రోజుల క్రితం కువైట్ కి వెళ్లాడు. తనకు చెప్పింది ఒక పని.. కాని కువైట్ వెళ్లాక దుర్భర జీవితం గుడుపుతున్నాని చెప్పాడు. ఏడారిలో వదిలేసి తీవ్రంగా వేదిస్తున్నారని శివ ఏడుస్తూ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కువైట్ లో శివ పడుతున్న కష్టాలు చూసిన ఆయన భార్య పిల్లలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దయచేసి తన తండ్రిని తిరిగి ఇండియాకు తీసుకొని రావాలని పిల్లలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇక కువైట్ కు వెళ్లేందుకు చేసిన అప్పులుండగా.. భర్త శివను ఎలా రప్పించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు శివ కుటుంబ సభ్యులు. శివ ఆవేదనపై స్పందించిన లోకేశ్- బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *