ఫిబ్రవరిలోనే రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ఫిబ్రవరిలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర బడ్జెట్ సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెలలో సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఫిబ్రవరి మూడ లేదా నాలుగో వారంలో బడ్జెట్ సమర్పించి, ఏప్రిల్ ప్రారంభం నుంచే పూర్తిస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి మంగళవారం సమీక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఇప్పటికే ఆర్థికశాఖకు చేరాయి.