ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణ ప్రేమ దయ క్షమించే దయా హృదయం ఏసు క్రీస్తు అని ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో 30 వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి, 29వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీపతి, పాస్టర్ దయానందం, 62వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు అలంపూర్ విజయ్ కుమార్, 61 డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటరావు, వైసిపి నేతలు పాల్గొన్నారు.