అమరావతి
ప్రాంతీయ పత్రికలకు గుడ్ న్యూస్
జీఎస్టీ, ఐటీ రిటర్న్స్ తో సంబంధం లేకుండా అక్రిడిడేషన్లు
ఎంప్యానల్‌మెంట్ పత్రికలే కాదు
రెగ్యులర్ పత్రికలను గుర్తిస్తాం… వాటికి యాడ్స్ ఇస్తాం
అన్ని పత్రాలు పరిశీలన తరువాతే ప్రకటనలు.
కూటమి ప్రభుత్వంలో చిన్న పత్రికలకు న్యాయం చేస్తాం.
సమాచార శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి
ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం ఆధ్వర్యంలో వినతి
గత ప్రభుత్వంలో జీఎస్టీ ఐటీ రిటర్స్ అంటూ ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతీయ పత్రికల ఎడిటర్లకు సమాచార శాఖా మంత్రి శుభవార్త చెప్పారు. క్యాబినేట్ సమావేశం అనంతరం సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో మంత్రి పార్థ సారధి ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం (ఏపీఎస్ఎస్) నేతలు ఆయన్ని కలిశారు. చిన్నపత్రికలకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి పార్థ సారధి సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డామని కూటమి ప్రభుత్వంలోనైనా ప్రాంతీయ పత్రికలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. దీంతో స్పంధించిన మంత్రి పార్థ సారధి ఇక నుంచి జీఎస్టీ, ఐటీ రిటర్న్స్ తో సంబంధం లేకుండానే అక్రిడిడేషన్లు, యాడ్స్ మంజూరు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో అయితే పర్యటిస్తారో ఆ జిల్లాలో ఎంప్యానల్‌మెంట్ పత్రికలతో పాటు రెగ్యులర్ గా వచ్చే పత్రికలకు కూడా యాడ్స్ ఇస్తామని మంత్రి హమీ ఇచ్చారు. ఎంప్యానల్‌మెంట్ ఉన్న పత్రికలకు వారి రేటు కార్డు ప్రకారం ఇస్తామని అలాగే రెగ్యులర్ గా వచ్చే వాటిని గుర్తించి ఇంత అని రేటు కేటాయించిన తర్వాత యాడ్స్ మంజూరు చేస్తామన్నారు.. గుర్తింపు పొందిన ఛార్టర్డ్ అకౌంట్ తో సీఏ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. ప్రాంతీయ పత్రికలందరికీ కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తామన్నారు. అందరి సమస్యలు వింటామని, అవసరమైతే అన్ని యూనియన్ల తో సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రాంతీయ పత్రికలను ఇబ్బంది పెట్టొద్దని రెగ్యులర్ గా వచ్చే వాటిని గుర్తించి యాడ్స్ ఇవ్వాలని తెలిపారు.ఎంతో కాలం నుంచి ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు ఎదుర్కొంటున్న సమస్యకు మంత్రి పార్థసారథి పరిష్కారం చూపించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ పత్రిక సంపాదన సంఘం ఆధ్వర్యంలో మంత్రి పార్థ సారధికి ధన్యవాదాలు తెలియజేశారు…మంత్రిని కలిసిన వారిలో ఎపీఎంపిఎ రాష్ర్ట అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు (ఏపీఎస్ఎస్) కుర్మా ప్రసాద్ బాబు, ఏపీజేయూ ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు, పోతుల వెంకట్, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.