ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించండి అని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆప్ జోనల్ కన్వీనర్ నేతి మహేశ్వర రావు

0
0

Date:3rd August 2025

ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించండి అని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ ఆప్ నాయకులు కార్యకర్తలు 1st August 2025 న ప్రభుత్వ స్కూల్లను పరిశీలించడం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లో బయట వ్యక్తులు వెళ్లడానికి అనుమతి లేదు అని జీవో ఇచ్చిన అంశం మీద ఆప్ జోనల్ కన్వీనర్ నేతి మహేశ్వర రావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడడం జరిగింది

నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడైతే ఆప్ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించడం జరిగిందో దానికి భయపడే రాష్ట్ర ప్రభుత్వం బయట వ్యక్తులు ముఖ్యంగా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో పరిశీలించకూడదు అని 1st August 2025 న చీకటి జీవో ఇవ్వడం జరిగిందని మాట్లాడడం జరిగింది

విజయవాడ లోని రామవరప్పాడు దగ్గర ఉన్న ప్రాథమిక స్కూల్ ని ఆఫ్ జోనల్ కన్వీనర్ నేతి మహేశ్వరరావు ఆప్ నాయకులు పర్వతనేని హరికృష్ణ తో కలిపి పరిశీలిస్తే విస్తు పోయే నిజాలు ఉన్నాయని మాట్లాడడం జరిగింది

ప్రాథమిక స్కూల్లో పిల్లల చదువుకోడానికి క్లాసులు లేక వరండాల్లో కూర్చుని చదువుకునే పరిస్థితి అలాగే తాగునీటి సదుపాయం లేని పరిస్థితి బాత్రూంలో ఆడపిల్లలకి మగ పిల్లలకు కలిపి ఉన్న పరిస్థితి ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణము కోసుకు పిల్లలకు పెట్టే తిండి కూడా నేలకూరలతో ఉన్న పరిస్థితి పిల్లలని అడిగితే బయటి వాళ్లు చెబితే కేసు పెడతామని అక్కడ అధ్యాపకులు అంటున్నారు అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో ఉందో అర్థం అవుతుంది అని మాట్లాడడం జరిగింది

ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లను పరిశీలిస్తే కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం స్కూల్లో అంటే భయపడే పరిస్థితి ఉంది అని అలాంటి పరిస్థితులు ఉన్న పరిస్థితులలో పార్టీల నాయకులు,మిగతా పౌర సమాజం ప్రశ్నిస్తుంటేనే సదుపాయాలు లేని పరిస్థితులలో అసలు ప్రశ్నించకూడదు అన్న విధంగా అంటే ప్రభుత్వ విద్యకు సమాధి కట్టడమే అని మాట్లాడడం జరిగింది

ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు తో సమానంగా రిక్షా కార్మికుడు కొడుకు చదివే సదుపాయాలు కల్పించిన పరిస్థితిని బయట ప్రపంచాన్ని పిలిచి పరిశీలించండి అని చెప్పిన పరిస్థితి ఉంటే ఇక్కడ అసలు కనీసం సదుపాయాలు లేకుండా ఉన్న పరిస్థితులలో బయటి వాళ్లు వెళ్లి పరిశీలించకూడదు అన్న విధంగా ఉన్నారు అంటే ఎక్కడ మీ బండారం బయటపడుతుందో అని భయపడుతున్నారు అని ఎద్దేవా చేయడం జరిగింది

లోకేష్ బాబు వాళ్ళ అబ్బాయి చదివే స్కూల్ కి పేరెంట్స్ గా వెళ్లారు అని ప్రచారం చేసుకున్న పరిస్థితులలో విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబు ని మేము ప్రశ్నిస్తున్న ప్రశ్న మీ అబ్బాయి చదివే స్కూల్ సదుపాయాలలో పేద పిల్లలు చదివే ప్రభుత్వ స్కూల్లో ఒక్క శాతం ఉన్న సంతోషిస్తామని మాట్లాడడం జరిగింది

ఒక నాయకుడిగా మన పిల్లలు ఎక్కడ చదువుతారు అలాగే పేదవాడు పిల్లోడు కూడా చదవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంటేనే మనల్ని నాయకులు అంటారు అని మన పిల్లలేమో ఉన్నత స్థితిలో పేదవాళ్ళ పిల్లలు మురికివాడల్లో చదువుకునే పరిస్థితి అంటే ఇది మీరు చేస్తున్న రాజకీయానికి ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న రాజకీయానికి వ్యత్యాసం అని చెప్పదలుచుకున్నామని మాట్లాడడం జరిగింది

ఇప్పటికైనా ఈ చీకటి జీవోనే తీసివేయాలి అని అలాగే గతంలో అమ్మబడి ఇప్పుడు తల్లికి వందనం అంటూ సుమారు 30 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టిన రెండు ప్రభుత్వాలు ఆడపిల్లలు మగ పిల్లలకు విడివిడిగా బాత్రూములు కూడా కట్టించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అంటే ఇది మీ ప్రచారానికి జరుగుతున్న వాస్తవానికి ఉన్న వ్యత్యాశమని మాట్లాడడం జరిగింది

ఒకవైపు ప్రవేట్ స్కూల్లో ఫీజులు కనీసం 40 వేలు ఉంటే ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఇస్తున్నది 15000 అంటే పేదవాడు ప్రైవేటు స్కూల్లో చదవలేదు అలాగని ప్రభుత్వ మురికి స్కూల్లో సర్వే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం రోజురోజుకీ పడిపోతున్న పరిస్థితి ఇంకా చెప్పాలంటే దేశంలోనే అట్టడుగును ఉన్న పరిస్థితి ప్రభుత్వ స్కూల్ మూతపడుతున్న పరిస్థితి ఈ మొత్తం కొట్రకు కారణం పేదవాడికి విద్య లేకుండా చేసి పేద యువకులకు మద్యం అలవాటు చేసి వర్గ పోరు సృష్టించి రాచరికాన్ని తలపిస్తున్న అరాచక విధానంతో ముందుకు వెళ్లడమే అని మాట్లాడడం జరిగింది

ఆప్ పార్టీగా మేము ఎప్పుడు పేదవాడికి నాణ్యమైన విద్యను అందిస్తేనే పేదవాళ్లలో చైతన్యం వచ్చే అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది అని అలాంటి పరిస్థితులను తీసుకురావడమే లక్ష్యంతో ఆప్ ఆ పని చేస్తుంది అని మాట్లాడడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు పర్వతనేని హరికృష్ణ పాల్గొనడం జరిగింది
నేతి మహేశ్వర రావు
ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here