ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన P-4 కార్యక్రమం ద్వారా పేద, అవసరమైన కుటుంబాలకు చదువు, వ్యాపారాలు, వైద్యం వంటి అన్ని రంగాల్లో అండగా నిలబడుతున్న – MLA బొండా ఉమ

Spread the love

ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన P-4 కార్యక్రమం ద్వారా పేద, అవసరమైన కుటుంబాలకు చదువు, వ్యాపారాలు, వైద్యం వంటి అన్ని రంగాల్లో అండగా నిలబడుతున్న – MLA బొండా ఉమ

విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడినా, తప్పకుండా చదివి ఉన్నత స్థానాలకు చేరాలి అన్న సంకల్పంతో – MLA బొండా ఉమామహేశ్వరరావు గారు మార్గదర్శిగా నిలిచి P-4 పథకంలో భాగంగా ₹2,50,000 సహాయాన్ని అందించి బాలికల భవిష్యత్తుకు భరోసాగా నిలిచారు

తమ చదువుకు రూ. 2.50 లక్షలు ఫీజులు చెల్లించి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అన్నిరకాలగా అండగా ఉంటామని మాకు భరోసా కల్పించి ధైర్యం చెప్పి మా భవిష్యత్తుకు మార్గం చూపిన -MLA బొండా ఉమ కి రుణపడి ఉంటాం – విద్యార్థినిలు

ధి:-10-12-2025 బుధవారం ఉదయం సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ ఆడపిల్లలు — షేక్ ఫరాహా సుల్తాన ఇంటర్ ఫస్ట్ ఇయర్ B.I.P.C, షేక్ సుహాన ఇంటర్ ఫస్ట్ ఇయర్ M.P.C, షేక్ నఫీస ఇంటర్ ఫస్ట్ ఇయర్ M.P.C, షేక్ అజ్మల్ 2nd క్లాస్, షేక్ నజ్మ 2nd క్లాస్ చదువుకుంటున్న విద్యార్థినులకు ₹2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విద్యార్థులకు అందజేశారు…

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-ఈ పిల్లలు మంచి చదువులు చదివి, తమ కుటుంబ స్థితిని మార్చి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని, వారి కలలు నిజమయ్యే దిశగా ప్రభుత్వం పరంగా, వ్యక్తిగత పరంగా అన్నిరకాల అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం అని, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన P-4 అనే పథకం ద్వారా ఎంతోమంది పేదవారికి నిత్యం సహాయం చేస్తూనే ఉంటామని, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన P4 కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల అభ్యుదయాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని…

విద్య, వైద్యం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల అభివృద్ధి వంటి రంగాలలో ఈ పథకం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తోంది అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం ఒక పెద్ద అండగా నిలుస్తోంది అని…

ఈ కార్యక్రమం లో భాగంగా ఈరోజు మైనారిటీ వర్గానికి చెందిన వరహా, సుల్తానా, నఫీసా, అజ్ములు, సుహానా, నజ్మా, నజ్బా వంటి ఐదుగురు ఇంటర్మీడియట్ (BiPC ఫస్ట్ ఇయర్) విద్యార్థినులకు ప్రత్యేకంగా విద్యాసహాయాన్ని అందించడం, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉండటం వల్ల చదువును కొనసాగించలేని స్థితి ఏర్పడినా, విద్య పట్ల వారి ఆసక్తి మరియు లక్ష్యాలను గౌరవించి, వారి భవిష్యత్తు కోసం మేము ముందడుగు వేశాము అని…

ఈ విద్యార్థులకు రూ. 2.50 లక్షల వరకు ఫీజులను భరించడం, చదువుకు అవసరమైన సదుపాయాలు, పుస్తకాలు, వసతి మొదలైనవి ఏర్పాటు చేయడం, వారి అకడమిక్ అభివృద్ధికి అవసరమైన మార్గదర్శనం ఇవ్వడం, ఇవన్నీ వారి విద్యాభ్యాసం అడ్డంకులు లేకుండా సాగేందుకు ఏర్పాట్లు చేస్తామని, రాష్ట్రానికి ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరితే వారి కుటుంబాల జీవితాలు మాత్రమే కాదు, సమాజం మొత్తం ఎదుగుదలను చేరుకుంటుంది అని…

విద్యే భవిష్యత్తు – విద్యే సమాజాభివృద్ధికి మార్గం అనే విశ్వాసంతో, ఇలాంటి పిల్లలు తమ కలలు నెరవేర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో :- ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, సెంట్రల్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్ భాషా, షేక్ రహీం, షేక్ నాగుల్ మీరా, షేక్ సుబాని, షేక్ యాకుబ్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు

Loading