ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
తేదీ.30-07-2025.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.
ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం లోని అడ్మిన్ డి.సి.పి. కార్యాలయం నందు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బాలలు మహిళల అక్రమ రావణాకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం అనే పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా అడ్మిన్ డి.సి.పి. మాట్లాడుతూ.. బాలలు మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రావణాపై
ప్రజలందరిలో అవగాహన, చైతన్యం మరింత పెంచాలని, అందరి సహకారంతోనే మానవ అక్రమ రమాణా నిర్మూలన సాధ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. తో పాటు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే వాసవి,
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్-AHTU టీం సభ్యులు మరియు ఫోరo ఫర్ చైల్డ్ రైట్స్,
విజయవాడ జిల్లా కోఆర్డినేటర్ శ్రీఅరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు.