ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదు.అబద్ధపు హామీలీవ్వడంలో బాబు దిట్ట.. జగనన్న చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు.

Spread the love


 _బాబుది బూటకపు మేనిఫెస్టో.


ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదు.అబద్ధపు హామీలీవ్వడంలో బాబు దిట్ట..

జగనన్న చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. 

ఎన్నికల సందర్భంగా చంద్రబాబు బూటకపు మేనిఫెస్టోను ప్రపంచ బ్యాంకుల సైతం అమలు చేయలేదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను  అన్నారు.

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు, నవాబుపేట గ్రామాల నందు ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి  అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయభాను  మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. 2014లో 100 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి  తన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తూ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేశారని అన్నారు. మరొకసారి ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అంటూ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాడని దానిని ప్రజల నమ్మొద్దని కోరారు. 2019 నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని గతం కంటే ఎక్కువ అభివృద్ధి చేశానని చెప్పారు. 14 కోట్ల రూపాయలతో జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. హైవే పై కోటి రూపాయలతో బస్టాండ్ నిర్మించడం జరిగిందన్నారు. అలాగే టిటిడి కళ్యాణ మండపాన్ని నిర్మించడంతో పాటు ముస్లింల కోసం షాదీ ఖానా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. పర్యాటక కేంద్రంగా ఊర చెరువును అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇలా జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మరొకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని జిల్లాలో మేటి పట్టణంగా అభివృద్ధి చేసి చూపుతానని చెప్పారు

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *