*ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ*
*తేదీ. 04.02.2025.*
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన అవగాహన
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా మణిపాల్ హాస్పిటల్ వారు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్స్ వారికీ అభినందనలు తెలిపారు. క్యాన్సర్ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. అయితే, ముందుగా గుర్తించడం, అవగాహన పెంపొందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. సమాజానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరం.” అని పేర్కొన్నారు. యునైటెడ్ బై యూనిక్” అనే థీమ్ తో నిర్వహించిన ఈ కార్యక్రమం, క్యాన్సర్ వ్యతిరేక పోరాటంలో సమాజం ఏకతాటిపై రావాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని, క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని, పరీక్షలు చేయించుకుని, ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు, గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ , మణిపాల్ హాస్పిటల్స్ నిర్వాహకులు, ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.