Home Andhra Pradesh ప్రపంచం మొత్తం మోడి వైపు

ప్రపంచం మొత్తం మోడి వైపు

2
0

ప్రపంచం మొత్తం మోడి వైపు

విజయవాడ మున్సిపల్ అధికారులు ప్రెస్ క్లబ్ ను రక్షించే వైపు….?

విజయవాడ,జూన్ 20:ప్రపంచ ప్రసిద్దిగాంచిన 11వ ప్రపంచ యోగా డే సందర్భంగా ప్రపంచ దేశల నేతలు ,భారత ప్రధాని మోడి చంద్రబాబులు రేపు జరగనున్న యోగా డేను విజయవంతం చేయాలని విశ్వ ప్రయత్నాలు చూస్తుంటే విజయవాడ సర్కిల్ 2 మున్సిపల్ అధికారులు
మాత్రం విజయవాడ ఎపియుడబ్లూజే నాయకులను కుటిల ప్రయాత్నాలకు కో్మ్ము కాసేందుకు ఉత్సాహం చూపించడం జరిగింది.వివరాల్లోకి వెళితే విజయవాడ మున్సిపల్ సర్కిల్ 2 అధికారులు శుక్రవారం సాయంత్రం గాంధీ నగర్ ఎపియుడబ్లూజే కార్యాలయం వద్దకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ వస్తున్నారని ఎపియుడబ్లూజే కార్యాలయం టాక్స్ పై క్లారిటి కోసం వస్తున్నారని మీరు వెంటనే రావాలని “ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులకు” ఆదేశం లాంటి సమాచారం ఇవ్వడం జరిగింది. అందుకు స్పందించిన విజయవాడ ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ ఎపియుడబ్లూజే వద్దకు వచ్చిన, అరగంట తరువాత ఏరియా ఇంచార్జ్, సర్కిల్ 2 అధికారి రావడం జరిగింది.ప్రెస్ క్లబ్ పై వారి కాగితాలు మీద, పేపర్లపై సంతకం పెట్టాలని ఎపియుడబ్లూజే ను రక్షించే ప్రయత్నం జరిగింది. అందుకు ప్రెస్ క్లబ్ సాధన సమితి సభ్యులు ఇక్కడ ఉన్నది ప్రెస్ క్లబ్ ?లేక ఎపియుడబ్లూజే కార్యాలయమా..? అని వివరణ కు సమాధానం చెప్పలేక నీళ్ళు నమలడం జరిగింది.సర్కిల్ 2 అధికారులు ఇచ్చిన పేపర్లు సైతం అక్షరాలు కనపడకపోవడంతో మరల మంచి కాగితాలు తీసుకోస్తామని వెళ్ళిన అధికారులు గంట సమయమైన రాలేదు. ఇది వార్తలు సమయం, అధికారుల మీద మర్యాద మీద వచ్చాము. ప్రపంచం మొత్తం అటెండర్ దగ్గర్నుంచి ప్రధానమంత్రి వరకు యోగ వైపు చూస్తుంటే, ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టటం, మా సమయ వృధా చేయటం కరెక్ట్ కాదని అధికారులకు తెలిపి ప్రెస్ క్లబ్ సాధన సమితి నేతలు సోమవారం ఇదే ప్రెస్ క్లబ్ దగ్గరకు అధికారులు తమను ఆదేశిస్తే వస్తామని తెలిపి వెను తీరిగారు. ప్రపంచం మొత్తం యోగపై సమాయాత్తం అవుతుంటే విజయవాడ సర్కిల్ 2 కొంత మంది అధికారులు ఓక వర్గం వారికి కొమ్ము కాయడం ఏమిటా..? అని జర్నలిస్టులు చర్చించుకోవడం కనిపించింది.ఏది ఏమైన జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతవరకైన పోరాడతామని, జర్నలిస్ట్ ప్రయోజనాలను తాకట్ఞు పట్టే శక్తులకు పరాభవం తప్పదని విజయవాడ ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here