ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు పీఎం పర్యటన విజయవంతంగా, అడ్డంకులు లేకుండా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పర్యటన అనేది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశం. ప్రతీ విభాగం క్రమశిక్షణతో, సమయపాలనతో వ్యవహరించాలి. ప్రజల భద్రత, సౌకర్యం అత్యంత ప్రాధాన్యముగా ఉండాలని అన్నారు.
రవాణా సదుపాయాల సమర్థ నిర్వహణ, పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణ, సభ నిర్వహణపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశం సందర్భంగా వాహనాల మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై విభాగాధిపతులతో చర్చించారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యం, సమయపాలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి చిన్న అంశంలోనూ సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తదనంతరం సహచార మంత్రులు, స్థానిక ఎంపీ, ఉన్నతాధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, మీడియా సెంటర్, వీఐపీ రూట్స్, అగ్నిమాపక సదుపాయాలు వంటి ఏర్పాట్లను పరిశీలించి సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పీఎం మోదీ పర్యటన రాష్ట్రానికి అభివృద్ధి దిశలో మరొక మైలురాయి అవుతుంది. కర్నూలు జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఈ పర్యటనను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు.
సహచర మంత్రులు సత్యకుమార్ యాదవ్, టిజీ భరత్, నిమ్మల రామానాయుడు, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నేతలతో ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు.
![]()
