ప్రత్తిపాటి శ్రీధర్ కు మెమొంటో ను అందజేస్తున్న రచయిత యేమినేని వెంకట రమణ

2
0

అభ్యుదయ భావాల “రమణీయం” పుస్తకావిష్కరణ.

సమకాలీన సమస్యలపై సీనియర్ పాత్రికేయులు యేమినేని వెంకట రమణ రచించిన “రమణీయం” పుస్తకావిష్కరణ శనివారం కొత్తపేట, కే బీ ఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.

ప్రముఖ రచయిత జనసేన పార్టీ చీఫ్ విప్ డాక్టర్ ఎం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు.

శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ కరుమారి దాసు తొలి ప్రతిని స్వీకరించి రచయిత రమణకు ఆశీస్సులను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఆకుల శ్రీనివాస్,ఎస్ కే పీ వీ వీ హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వీ నారాయణరావు, కేబీఎన్ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాస్, కే బీ ఎన్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు చెవుల ఆంజనేయులు, చింతలపూడి సత్యనారాయణ, గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు..

ఎస్ కే పీ వీ వీ హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ యేమినేని వెంకట రమణ విద్యార్థి దశ నుంచి సామాజిక, రాజకీయ విషయాలపై సమగ్ర విశ్లేషణ చేశారన్నారు
బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా, రచయితగా సమాజాన్ని ప్రభావితం చేసే అనేక ఆసక్తికరమైన విషయాలను పాఠకులతో పంచుకున్నారని తెలిపారు. అనేక సమగ్రమైన విషయాల సమాహారం, అభ్యుదయ భావాల “రమణీయం” పుస్తకం రచించడం సంతోషకరమన్నారు,
తమ కళాశాల వేదికగా యేమినేని “రమణీయం” పుస్తకావిష్కరణ జరగటం గర్వకారణమన్నారు
అభ్యుదయ భావాలు కలిగిన రమణ మరెన్నో పుస్తకాలను రచించాలని , ఆయురారోగ్యాలతో ఉండాలని డాక్టర్ నారాయణరావు ఆకాంక్షించారు.

తన చుట్టూ ఎన్నో సంక్షోభాలు ఉన్న , సవాళ్లు ఎదురైనా జర్నలిస్టు మిత్రుల సహకారంతో, అనేకమంది ప్రోద్బలంతో పుస్తకాన్ని పూర్తి చేశానని రమణ తెలిపారు.
“రమణీయం” పుస్తకావిష్కరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పాటు నిచ్చిన ప్రతి ఒక్కరికి రచయిత యేమినేని వెంకట రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠకులు,మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సహకారంతో మరిన్ని రచనలు చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here