ప్రతీ ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలి మాజీ ఎమ్మెల్సీ బీ. జే. వై.ఎం.వైస్ ప్రెసిడెంట్ పీ వీ ఎన్ మాధవ్,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

5
0

ప్రతీ ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలి మాజీ ఎమ్మెల్సీ బీ. జే. వై.ఎం.వైస్ ప్రెసిడెంట్ పీ వీ ఎన్ మాధవ్,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని శాసన మండలి మాజీ సభ్యులు పీ. వీ .ఎన్ మాధవ్ ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు.పచ్చదనాన్ని మరింత పెంచేందుకు గురువారం నుంచి కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు, పిలుపునివ్వడంతో, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా వన్ టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ఆవరణలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ బీ.జే.వై.ఎం వైస్ ప్రెసిడెంట్, మాజీ శాసన మండలి సభ్యులు పీ వీ ఎన్ మాధవ్,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ముఖ్యఅతిథిలు గా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో పెద్ద ఎత్తున కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు .విద్యా సంస్థలు, ఆసుపత్రులు ,ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి స్వచ్ఛమైన వాతావరణం అందించడానికి ప్రతి పౌరుడు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో పర్యావరణం మెరుగుపడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , డీ.ఈ.ఓ వీ వీ సుబ్బారావు,గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కందుల మల్లికార్జున రెడ్డి, గాంధీజీ మహిళా కళాశాల కమిటీ చైర్మన్ పిచ్చియ్య ఏ .ఏం. హెచ్. ఓ చంద్రశేఖర్ ,సూపర్ వైజర్ రమణ, ఏఈ శ్రీనివాసరావు, ఉపాధ్యులు కే శ్రీనివాసరావు, ఆచార్యులు ఎన్డీఏ కూటమి నేతలు రెడ్డిపల్లి రాజు, ప్రదీప్ రాజ్, సత్య సాయి ప్రసాద్, దొడ్ల రాజా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here