విజయవాడ నగరపాలక సంస్థ
04-08-2025
ప్రతి కాంప్లెక్స్ కి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం
ప్రతి కాంప్లెక్స్ కి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్, లెనిన్ సెంటర్, జింఖానా గ్రౌండ్, అల్లూరి సీతారామరాజు పార్క్, ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రతి కాంప్లెక్స్ కి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండేటట్టు అధికారులు నిర్ధారించాలని అన్నారు. నగర పాలక సంస్థవైతే సరిపడా మరుగుదొడ్లు ఉండాలని, ప్రైవేట్ కాంప్లెక్స్ లైతే వారు కూడా ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండేటట్టు చూసుకోవాలని లేనిచో నిర్మించు కోవాలని, అధికారులు కాంప్లెక్స్ అన్ని కాంప్లెక్స్ లు పరిశీలించి ప్రైవేట్ కాంప్లెక్స్ లలో మరుగుదొడ్లు లేకపోతే వారి ట్రేడ్ లైసెన్స్ లను క్యాన్సిల్ చేయాలన అన్నారు.
నగర పరిధిలో కనీసం సర్కిల్ కి ఒకటి ఉండేటట్టు పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సర్కిల్ 3 పరిధిలో గల బెంజ్ సర్కిల్ లో ఉన్న పింక్ టాయిలెట్ లో మహిళలకు అవసరమైన వసతులు ఇంకా ఏమైనా ఉన్నచో వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి. సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యుసిడి) పి.వెంకటనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.