ప్రతిరోజు ఇంటి వద్దనే వ్యర్ధాల సేకరణ జరగాలి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు

4
0

విజయవాడ నగరపాలక సంస్థ 15-07-2025 ప్రతిరోజు ఇంటి వద్దనే వ్యర్ధాల సేకరణ జరగాలి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు ఇంటి వద్దనే వ్యర్ధ సేకరణ కచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్, రామవరప్పాడు రింగ్, కరెన్సీ నగర్, మెయిన్ రోడ్, హై టెన్షన్ లైన్ రోడ్, గురునానక్ కాలనీ, పటమట, పంట కాలువ రోడ్డు, రైతుబజార్, హై స్కూల్ రోడ్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. నగరంలోని వార్డులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని అందుకు అవసరం అయితే కాంట్రాక్ట్ ద్వారా వార్డుకు కనీసం పదిమందినైనా తీసుకొని పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రతిరోజు నగరపాలక సంస్థ వారి 60 ట్రాక్టర్లు, 140 క్లాప్ ఆటోలు, 15 ప్రైమరీ ఆటోలతో ఇంటింటి వ్యర్థ సేకరణ జరుగుతూ ఉండాలని, ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తనివ్వకూడదని, ప్రతి వార్డ్ పరిశుభ్రంగా ఉండాలని దానికి సానిటరీ ఇన్స్పెక్టర్ బాధ్యత వహించాలని, పెద్దవార్డులకు అవసరమైతే అధికంగా వర్కర్లను తీసుకొని నగరంని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు నిత్యం ఫీల్డ్ లోనే ఉంటూ పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here