ప్రజా సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష
ప్రత్యేక శ్రద్ధతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) అన్నారు. తాడిగడప లోని తమ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సుజనా చౌదరి వి ఎం సి కార్పొరేషన్ అధికారులతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డివిజన్లో సమస్యలు భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చిస్తూ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అధికారులు వివిధ శాఖల అధికారులతో ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాలని , ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా డ్రెయిన్లు, రోడ్లు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, మీద ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. డివిజన్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని పశ్చిమ ప్రజలకు హామీ ఇచ్చారు.